బ‌డ్జెట్ లో బీసీల‌కు జ‌రిగిన మోసానికి నిర‌స‌న‌గాఛ‌లో అసెంబ్లీకి పిలుపు : బేరి రామచందర్ యాదవ్

పయనించే సూర్యుడు, మార్చి 25 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 2026 మోసపూరిత బడ్జెట్ అనే అంశంపై రౌండ్ టేబుల్ అధ్యక్షుడు డి రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ బడ్జెట్లో మోసపూరిత కేటాయిం పులపై త్వ‌ర‌లో అన్నీ బీసీ సంఘాల‌ను క‌లుపుకొని ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాం అని అన్నారు. బిసిల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ద్వంద వైఖరి ప్రస్తుత ప్రభుత్వానికి తగదని, బడ్జెట్ కేటాయింపులు బీసీల పట్ల యేమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ఈ విషయం పట్ల రాహుల్ గాంధీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సరైన పద్ధతి కాదని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి మనుగడ ఉండదని రాష్ట్ర డిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని కూక‌టి వేళ్ల‌తో స‌హా పెకిలించేందుకు బీసీలంతా ఐక్యం కావాల‌ని డి. రాజారాం యాద‌వ్ పిలుపునిచ్చారు. సోమ‌ వారం సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సా. 5 గంట‌ల వ‌ర‌కు బీసీల‌కు మ‌రో మోసం-2026 బ‌డ్జెట్ అనే అంశంపై జ‌రిగిన రౌండ్ టేబుల్ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించి ఆయ‌ న‌..ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రాజ‌కీయంగా, ఆర్థికంగా అన్నిరంగాల్లో బీసీల‌ను మోసం చేస్తుంటే.. రా హుల్ గాంధీ దృత‌రాష్ట్రుడిలాగా క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకున్నాడని అన్నారు. కామారెడ్డి డిక్ల‌రేష‌న్ లో భాగంగా స్థానిక సంస్థ‌లు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 24 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌న్న‌ వాగ్ధానికి తిలోద‌కాలు ఇచ్చాడని ఆరోపించారు. బ‌డ్జెట్ కేటాయింపుల్లో బీసీల‌కు చేసిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఛ‌లో అసెంబ్లీ కార్య‌క్రమానికి పిలుపునిచ్చారు. మిగ‌తా బీసీ సంఘాల నాయ‌కులు ఆర్.కృష్ణ‌య్య‌, జాజుల శ్రీనివాస్ గౌడ్, చి రంజీవి, నార‌గోనిల‌ను సంప్ర‌దించి ఉమ్మ‌డి ఐక్య కార్యా చ‌ర‌ణ‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు. బీసీల న‌య‌వంచ‌కుడు సీఎం రేవంత్ రెడ్డిని గ‌ద్దె దించే వ‌ర‌కు త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మండ‌లి ప్ర‌తి ప‌క్ష నేత‌, మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌న‌చారి..కాంగ్రెస్ పార్టీ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర అంతా మోస‌పూరిత మోస‌పూరిత చ‌రిత్రేన‌ని బ‌డ్జెట్ కేటాయిం పుల‌తో మరోసారి నిరూపించుకుంద‌ని విమ‌ర్శించారు. బీసీల ప‌ట్ల కాంగ్రెస్ వైఖ‌రిని ప్ర‌జాక్షేత్రంలో ఎండ‌గ‌డ‌తా మ‌ని అన్నారు. మ‌రో అతిథి, మాజీ ఎంపీ బడుగుల లింగ‌య్య మాట్లాడు తూ..త్వ‌ర‌లోనే జిల్లాలవారీగా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాలను ముట్ట‌డిస్తామ‌ని అన్నారు. బీసీల‌కు స‌రైన బ‌డ్జెట్ ఇవ్వ‌కుండా న‌మ్మించి మోసం చేసింద‌ని ఆరోపించారు. జిల్లాలవారీగా రౌండ్ టేబుల్ స‌మావేశాలు ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ద్వంద‌వైఖ‌రిని ఎండ‌గ‌డ‌తామ‌ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. కామారెడ్డి డిక్ల‌రేష‌న్ లో ఇచ్చిన ఏ ఒక్క‌ హామీని సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్టించుకోలేదని ఆయ‌న ఆరోపించారు. 2023 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్ర‌తి హామీ ప‌చ్చి మోస‌మ‌ని సాహిత్య అకాడెమి మాజీ చైర్మ‌న్ జూలూరి గౌరీశంక‌ర్ ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండ‌ల, గ్రామ స్థాయిలో డ్జెట్ ప్ర‌తుల ద‌హ‌నం కార్య‌ క్ర‌మాన్ని చేప‌డ‌తామ‌న్నారు. యాద‌వ హ‌క్కుల పోరాట స‌మితి జాతీయ అధ్య‌క్షుడు మేక‌ల రాములు యాద‌వ్, స‌ర్పంచుల సంఘం అధ్య‌క్షుడు యాద‌య్య గౌడ్, బీసీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్య‌క్షుడు కాటం న‌ర్సిం హులు, భేరీ రాంచంద‌ర్ యాద‌వ్, సాయ‌న్న ముదిరాజ్, బ‌లిజ ర‌మేష్, సింహం, లొడంగి గోవ‌ర్ద‌న్, వీరేశం, అ యోధ్య‌, ఓయూ విద్యార్థి నాయ‌కుడు దత్తాత్రేయ‌, మ‌హేష్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *