అధిక లాభాల కోసం పయనీర్ సాగు చేయాలన్న రైతుల నిర్ణయం

"రైతులకు అవగాహన కల్పించిన పయనీర్ కంపెనీ అశోకు రెడ్డి. భాను ప్రకాష్"

పయనించే సూర్యుడు మార్చి 26 రాజేష్) రాయపోలు మండల పరిధిలోని ఒక గ్రామంలో రైతు గడ్డమిది దుర్గయ్య పొలంలో పయనీర్ కంపెనీకి చెందిన నూతన మక్కజొన్న వంగడం పి35719 పై కోతకాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై పంటను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, వచ్చే యాసంగి సీజన్‌లో పయనీర్ కంపెనీ పి35719 మరియు 27పి37 వంగడాలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పయనీర్ కంపెనీ ప్రతినిధులు అశోక్ రెడ్డి, భాను ప్రకాష్ మాట్లాడుతూ ఈ నూతన రకం రోగ నిరోధకత కలిగి ఉండి అధిక దిగుబడిని ఇస్తుందని వివరించారు. అలాగే ప్రస్తుతం పి3302, పి35105, పి3567, పి3312 వంటి మక్కజొన్న వంగడాలను సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చని సూచించారు. ఆగ్రోస్ అంజిరెడ్డి మాట్లాడుతూ రైతులు మంచి దిగుబడి, లాభాలు పొందాలంటే నాణ్యమైన పయనీర్ విత్తనాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. వరి, మక్కజొన్న పంటలలో పయనీర్ వంగడాలు అధిక దిగుబడులు ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు దుర్గయ్య కృతజ్ఞతలు తెలిపారు. తాను అనేక సంవత్సరాలుగా పయనీర్ విత్తనాలు సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నానని, ఇతర రైతులు కూడా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులు స్వామి, కిష్టారెడ్డి, దశమంతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *