పయనించే సూర్యుడు మార్చ్ 26 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ లో రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మన్నను కలిసి పూజా కార్యక్రమాలకు ఆహ్వానించిన నందవరం గ్రామ వాల్మీకి ముఖ్య నాయకులు ఎన్ లింగమూర్తి, దేవుళ్ళ పెద్ద రామన్న, ఈ తిమ్మరాజు, భీమ శేఖర, డి నాగరాజు, టీ పాండు, రాజు, ఆర్ గజేంద్రనాయుడు, పి నాగరాజు, జి నారాయణ, సి బాలరాజు, మొదలగు నాయకులు. కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గo,నందవరం మండలం నందవరం గ్రామంలో మాత బంగారమ్మ దేవి దేవాలయం నూతన గోపుర కలశం, మరియు ముఖ ద్వారం ప్రతిష్టాపన మరియు వాల్మీకి మహర్షి విగ్రహమునకు పూజా కార్యక్రమం 2-4-2026 తేదీన ఉదయం 7 -05 నిమిషాల నుంచి 10-05 నిమిషాల వరకు పూర్ణాహుతి కార్యక్రమం తదుపరి తీర్థ ప్రసాదం.మధ్యాహ్నం1-00 గంటకు అన్న ప్రసాద కార్యక్రమాలు జరుగును.కావున ప్రజలందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలకు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో నందవరం గ్రామ వాల్మీకి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.