ఉపాధిహామీ కూలీలకు చల్లని మజ్జిగ పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 26 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండల్ ఎండల తీవ్రత దృష్ట్యా రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామ శివారులోని నల్లగుట్ట వద్ద ఫారం పండ్ పనిచేస్తున్న ఉపాధిహామీ పథకం కూలీలకు రాయికల్ శ్రీ యశోద హాస్పిటల్ వారి అధ్వర్యంలో సుమారు 150 మందికి బుధవారం చల్లని మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శ్రీ యశోద మేనేజింగ్ డైరెక్టర్ ఆదిముల్క ప్రభాకర్ మాట్లాడుతూ…. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా తమవంతుగా చల్లని మజ్జిగను పంపిణీ చేయడం జరిగిందన్నారు.వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న తరుణంలో కూలీలు ఎక్కువగా నీరు త్రాగాలని సూచించారు.తమ హాస్పిటల్ లో రూ. 200 లకే ఒక కుటుంబానికి సంవత్సర కాలానికి హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, హెల్త్ కార్డు తీసుకున్న కుటుంబ సభ్యులకు సంవత్సరం పాటు ఓపి ఉచితంగా చూడడంతోపాటు హాస్పిటల్ ఖర్చులు, టెస్టులు,మందుల కొనుగోలుపై రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కూలీలు, గ్రామస్తులు, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం గ్రామ సర్పంచ్ దిండిగాల గంగు-రామస్వామి గౌడ్ మాట్లాడుతూ ఎండ వేడిమిని తట్టుకొని కనీస అవసరం కోసం పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సహృదయంతో ముందుకు వచ్చి చల్లని మజ్జిగను పంపిణీ చేసిన శ్రీ యశోద హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఉదయం 7 గంటల వరకు కూలీలు పని ప్రదేశానికి చేరుకొని ఉపాధిహామీ సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేసి కనీస వేతనం పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ యశోద హాస్పిటల్ సిబ్బంది లక్ష్మణ్, శ్రీనివాస్ ,ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాయకులు మాద రాజేశం, లక్ష్మీనారాయణ, అనుపాల్,లక్ష్మీనర్సయ్య, శ్రీనివాస్,కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *