బడేసాహెబ్ తాతా నెలపూజ సందర్బంగా బుట్టా ఫౌండేషన్ మంచినీటి ట్యాంకర్ల ఏర్పాటు

* బుట్టా రేణుకమ్మకు కృతజ్ఞతలు తెలిపిన గంజిహళ్లి గ్రామ వైసీపీ నాయకులు * సేవ కార్యక్రమాలు చేయాలంటే బుట్టా ఫౌండేషన్ కె సాధ్యం ఐటి వింగ్ అధ్యక్షుడు ముల్లా రఫీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26,2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండల పరిధి గంజిహళ్లి గ్రామంలో జరిగే శ్రీ శ్రీ శ్రీ సద్గురు మహాత్మా బడే సాహెబ్ తాత నెల పూజ సందర్భంగా, గంజహల్లి గ్రామానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, నీటి కొరతతో గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో, స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోనెగండ్ల మండలం ఐటి విభాగం అధ్యక్షులు గంజహల్లి ముల్ల రఫీక్, నరసింహ ఆచారి, పూర్ణ నాయుడు ఈ విషయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి స్పందించే బుట్టా రేణుకమ్మ , పరిస్థితిని గమనించి వెంటనే బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివనీలకంఠ తో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకునేలా సూచించారు. ఆమె సూచనల మేరకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి, గ్రామములో తాగునీటి సరఫరా ప్రారంభించారు. ఈ ట్యాంకర్ల ద్వారా అక్కడికి విచ్చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు సౌకర్యర్థం స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేశారు. ఈ సందర్బంగా భక్తులు మాట్లాడుతూ ఈ వేసవి కాలం ఎల్ ఎల్ సి కాలువలో నిరు లేవని స్వామి వారి ఊరుసు మహోత్సవం లో నీటి కొరతతో ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని, అనుకోవడం జరిగిందని, బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా చేయడంతో నీటి కొరత తమకు తీరుందని, ముందుగానే ఈ సమస్యను స్థానిక వైసిపి నాయకులు బుట్టా రేణుకమ్మ దృష్టికి తీసుకెళ్లడంపై గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేసారు.ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి స్పందించిన బుట్టా రేణుకమ్మకు బుట్టా శివనీలకంఠ కూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామములో జరిగే ప్రతి ఉత్సవానికి, బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం చూస్తున్నమ్మన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు బుట్టా ఫౌండేషన్ కొనసాగించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *