కల్దుర్కీలో వారాంతపు సంత పున:ప్రారంభం.

* వారాంతపు సంతను ప్రారంభిస్తున్న గ్రామ పెద్దలు.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26 బోధన్ : బోధన్ మండలం కల్దుర్కీ గ్రామంలో బుధవారం గ్రామ అభివృద్ధి కమిటీ,పంచాయతీ పాలకవర్గం,గ్రామ పెద్దల నిర్ణయంతో వారాంతపు సంతను పునః ప్రారంభించారు.గ్రామంలో 50 సంవత్సరాల క్రితం సంత జరిగేదని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.వ్యాపారస్తులు వారాంతపు సంతకు భారీగా వచ్చి సంత నిర్వహనకు సహకరించాలని గ్రామ పెద్దలు కోరారు.సంతా ప్రతి బుధవారం నిర్వహించినట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు.సంత నిర్వహణ కొరకు గ్రామ ప్రజలు సహాయ సహకారాలు అందించవలసిందిగా తెలిపారు.చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు క్రయవిక్రయాల కొరకు భారీ సంఖ్యలో తరలి రావాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి,వీడిసి చైర్మన్ బంటు గంగాధర్,ఉపసర్పంచ్ జ్యోతి శంకర్,వీడిసి వైస్ చైర్మన్ బాబు,కోశాధికారి సాయి పటేల్,గ్రామ పెద్దలు ప్రకాష్ పటేల్,నానాపటేల్,మారయ్య,న్యాలం శ్రీనివాస్,వీడీసీ సభ్యులు,పంచాయతీ పాలకవర్గం,సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *