డ్రైనేజిలో పెరుకపోయిన చెత్త హైస్కూల్ మైదానంలో నిలిచిన మురుగు నీరు

డ్రైనేజ్ శుభ్రం చేయడానికి లేకుండ స్కూల్ ప్రహరీ గోడ వెంబడి వెలసిన షాపులు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26,2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో గత నాలుగు రోజులుగా డ్రైనేజీ మురుగు నీరు చేరి దుర్వాసన వస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయాలన్న క్రికెట్ ఆడాలన్న దుర్వాసన దాటికి ముక్కు మూసుకొని ముందుకు పోయే పరిస్థితి రావడం దౌర్భాగ్యం ఏంటని గ్రామస్తులు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముల్లా ఖాసింవలి, జనసేన నాయకులు గానిగ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ కాంపౌండ్ వాల్ అనుకోని డ్రైనేజ్ ఉందని, డ్రైనేజ్ పైనే అక్రమంగా షాపులు నిర్మించుకోవడంతో, డ్రైనేజ్ సుప్రపరచడానికి వీలు లేకుండా పోవడంతో డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోయి, మురుగునీరు ముందుకు పోలేక, స్కూల్ క్రీడా మైదానంలోకి, మురుగు నిరు చేరుతుందని,ఇప్పటికైనా పంచాయితీ అధికారులు డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పాఠశాల మైదానంలో నిలిచిన మురుగు నీటిని సత్వరమే తొలగించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *