రెంజల్ మండల కేంద్రంలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 26 రెంజల్ : ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్, ఎన్సిసిఎఫ్ నేతృత్వంలో రెంజల్ మండల కేంద్రంలోని గ్రామంలో మండల ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్ వైస్ ఎంపీపీ గంగకృష్ణ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎల్ రాజ్ గ్రామ పెద్దలు మంగళవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.క్వింటాలుకు 5875 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లు మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ స్పష్టం చేశారు.ఎకరానికి 7 క్వింటాళ్ల 62 కిలోలు శనగ పంటను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా శనగ పంటను విక్రయించాలని మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ సూచించారు.ఎకరానికి 7 క్వింటాళ్ల 62 కిలోలు పంట కొనుగోలు నిబంధనలు సడలించి రైతు పండించిన మొత్తం పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు నాయకులు మరియు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *