పయనించే సూర్యుడు మార్చి 26, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆపదలో ఉన్నవారికి కష్టకాలంలో అండగా కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటుందని ప్రజలందరి ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా ఉన్నామని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా నియోజకవర్గం లో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తున్నామని, సేవలు అందించే విషయంలో అలాగే, ఆపదని వచ్చిన వారికి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తగిన సహాయ సహకారాలు అందించి ఆదుకోవడం జరుగుతుందని దీనిని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈరోజు తిమ్మాపురం గ్రామానికి చెందిన సవరం దాసు కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు, అలాగే సూర్యరావుపేట గ్రామానికి చెందిన రమ తండ్రి కొండబాబుకు లక్ష రూపాయలు, చెక్కులు అందించడం జరిగింది. జరిగింది.