కొడవటూరు శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు

ఆదాయం 3,59,197

పయనించే సూర్యుడు, మార్చి 26 బచ్చన్నపేట మండల ప్రతినిధి నీల పవన్. మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కొడవటూరు స్వయంభు శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ 3,59,197 సమకూరినట్లు ఈఓ చిందం వంశీ తెలిపారు. 2026 జనవరి 04 నుండి 2026 మార్చి 24వరకు భక్తులు హుండీలో సమర్పించిన 80 రోజుల కానుకల ఆదాయాన్ని ఆలయ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో లెక్కించారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ గ్రామ సర్పంచ్ నీల, కవిత మురళి, ఉప సర్పంచ్ దయాకర్ రెడ్డి, మాజీ దేవస్థానం డైరెక్టర్ నిమ్మ కరుణాకర్ రెడ్డి ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది లక్ష్మికాంత్ రెడ్డి మరియు మహబూబాబాద్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవ సమితి వారు, గ్రామస్తులు వచ్చిన్నట్లు ఈఓ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *