కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న సర్పంచ్ కోడూరి స్వర్ణలత శివకుమార్ గౌడ్

పయనించే సూర్యుడు, మార్చ్ 25, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని కొన్నే గ్రామంలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో బుధవారం మొదటి రోజున గణపతి పూజ మొదలుకొని పుణ్యవచనం ఉత్సవ అఖండ దీపారాధన రక్షాబంధనము ఉత్సవమూర్తులకు అభిషేకము మంటపారాధన తదితర కార్యక్రమాలలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ కోడూరి స్వర్ణలత శివకుమార్ గౌడ్ . బ్రహ్మోత్సవంలో భాగంగా మూడు రోజులు కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు. మూడో రోజు అయిన నవమి రోజున శ్రీ కోదండ రామస్వామి కి సీతా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం తదనంతరం అన్నదానము ఆ తరువాత పల్లకి సేవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు మినాలాపురం హనుమంతరావు, సిద్ధార్థ శర్మ, సిద్ధి రాములు, సిద్ధారెడ్డి, రామాంజనేయులు, లక్ష్మణ్ గౌడ్, భద్రయ్య అభినయ సంపత్ శ్రీరాములు కలకుంట్ల స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *