రామప్రభు ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభం

పయనించే సూర్యుడు, మార్చి 26 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ మియాపూర్ 240 డివిజన్‌లో స్థానిక నాయకుడు అట్టేపల్లి రామప్రభు మియాపూర్ ప్రజల ఆరోగ్యరీత్యా ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌ను ఈరోజు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్థానిక ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సాయం త్వరితగతిన అందాలనే ఉద్దేశంతో ఈ అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఏర్పాట్లు చేసిన రామప్రభును ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు శేర్లింగంపల్లి కాంగ్రెస్ కోఆర్డినేటర్ రఘునాథ్ రెడ్డి అట్టేపల్లి పురుషోత్తం శర్మ సమ్మెట ప్రసాద్ డాక్టర్ రవికుమార్ చౌదరి నరసింహారెడ్డి రాజేంద్రప్రసాద్ స్వామి ఆంజనేయులు ప్రసాద్ నాయుడు ఏ ఆర్ పి టీం సభ్యులు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *