అంగనవాడి టీచర్స్ బలోపేతానికి కృషి:- టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు.

పయనించే సూర్యుడు మార్చ్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాపు కళ్యాణ మండపంలో టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జోన్ టు టి ఎన్ టి యు సి ఇంచార్జ్ సబ్బతి పనేశ్వరరావు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కు అనుసంధానంగా పని చేయుచున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సన్ టిఎన్టియుసి అనుబంధ సంఘముగా ఏర్పడేటికై ముమ్మిడివరం ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న టీచర్స్ అందరిని టిఎన్టిటీయూసీ ఆహ్వానం పరుకుతూ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర టిఎన్టిటియుసి అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు పాల్గొని మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధముగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సంప్రదింపులు చేసి సాధిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ ఎంప్లాయ్ లైబులిటీ ప్రకారం టిన్ కోటర్ అలాట్మెంట్ తో ఇ ఎస్ ఐ, పి. ఎఫ్, అమలు చేయాలని చేసే విధముగా కృషి చేస్తుంది టిఎన్టిటి యుసి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల కోటి దొరబాబు, తాడి నరసింహారావు, సాగి రాజు సూరిబాబు రాజు, గొల్లపల్లి ధర్మారావు, మెండి కమల, కల్పన కడప, అనంతలక్ష్మి, సామ్రాజ్యం, అనంత వెంకటలక్ష్మి,అర్ధాని శ్రీనివాసరావు , చిక్కాల అంజిబాబు,ఏళ్ల ఉదయ్, నక్క రామకృష్ణ, గొల్లపల్లి గోపి,మొదలగు వారు పాల్గున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *