పయనించే సూర్యుడు మార్చి 26 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి మహిళల కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. బుధవారం ఆదోని అసెంబ్లీ పరిధిలోని నిజాముద్దీన్ కాలనీ నందు దాదాపు 30 లక్షల రూపాయల నిధుల తో మహిళల ఆత్మగౌరవం కాపాడుకోవడం కొరకు సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు భూమి పూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోనిలో పలుచోట్ల మహిళల కోసం సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేస్తున్నామని చేస్తున్నామని ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి దగ్గర్లో ఉన్నాయని తెలిపారు. సామూహికంగా కాకుండా ఇంటిముందు స్థలం ఉంటే వారికి కూడా మరుగు దొడ్లు ఏర్పాటు చేయడం కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.