కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితమైన హామీ ఇచ్చేంతవరకు రిలే నిరాహార దీక్షలు ఆగవు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 26 ఆదోని డివిజన్ ఇంచార్జ్ బొమ్మల బాలస్వామి ఆదోని జిల్లా సాధన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 130 రోజుల రిలే నిరాహార దీక్షలో కూర్చున్నవారు సుభాష్ చంద్రబోస్, రామాంజనేయులు, కుమార్, రామకృష్ణ, జిల్లా సాధన జేఏసీ నాయకులు వై పి నాగరాజు, గుమ్మల బాలస్వామి, బీఎస్పీ రామలింగయ్య, దీక్షను ప్రారంభించి వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోరుతూ గత 130 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉంటే పాలక ప్రతిపక్షా నాయకులు స్పందించి మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం దేశ ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఖచ్చితమైన హామీ వచ్చేంతవరకు ఈ దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ఆదోని జిల్లా సాధన జేఏసీ కమిటీ స్పష్టం చేసింది దీక్ష శిబిరాన్ని ముగించుకొని రోజు ఒక ప్రాంతంలో ఆదోని జిల్లా ఆవశ్యకతను ప్రజకు కరపత్రాల ద్వారా మరియు ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నాంమని వారన్నారు మరియు గతంలో ఆదోని జిల్లా సాధన జేఏసీలో పనిచేసి జేఏసిని వదలి వెళ్లిపోయిన వారు మరి ఒక నూతన ఆదోని జిల్లా సాధన అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకొని మధిర గ్రామంలో అవగాహన సదస్సు మరియు ఆదోని టౌన్ కుమ్మరి వీధిలో జిల్లా అవగాహన మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఆదోని జిల్లా సాధన జేఏసీ కమిటీ వారు రిలే నిరాహార దీక్ష వేదికగా మరియు ఆదోని ప్రజల తరపున వారికి అభినందనలు తెలియజేశారు అందులో భాగంగానే నూతనంగా ఏర్పడిన ఆదోని జిల్లా సాధన అభివృద్ధి కమిటీ వారికి ఆదోని జిల్లా సాధన కమిటీ జేఏసీ నాయకులు తెలియజేస్తున్నది ఏమనగా నెలకి ఒక ప్రోగ్రాం చేయకుండా రోజు ఒక గ్రామ వార్డు లో పోయి ఆదోని జిల్లా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుచున్నాము ఎందుకంటే అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి సమయం తక్కువ ఉన్నదని అందరం గుర్తించుకోవాలి ఇకపోతే ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ తమవంతుగా ఆదోని జిల్లా సాధనలో భాగస్వాములై ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని రిలే నిరాహార దీక్ష వేదికగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో, ఏఐఎఫ్టియు నాయకులు గంగన్న, జేఏసీ నాయకులు దాసరి గోవిందు, దాసరి నరేష్, జై భీమ్ సాయిరాం, దాసరి రామచంద్ర, మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *