డిండి మండల కేంద్రంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

డిండి మండల ఎస్సై సిహెచ్ బాలకృష్ణ

పయనించే సూర్యుడు మార్చ్ 26( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో రోడ్డు భద్రత అవగాహన అవగాహన కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో డిండి ఎస్ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలకు, ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని ఈ సందర్భంగా ఎస్సై ప్రయాణికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు మరియు స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *