పయనించే సూర్యుడు 0న్యూస్,మార్చి 26 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):ఏలేశ్వరం నగర పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు బుధవారం పర్యటించారు.పట్టణంలోని 7వ వార్డుకు చెందిన పారేపల్లి వీరభద్రరావు ఇటీవల మృతి చెందగా ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు వీరభద్రరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో సామంతుల సూర్యకుమార్,వాగు బలరాం,పైల విజయ్,ముద్రగడ వీరేంద్ర,కోరాడ ప్రసాద్,సుంకర రాంబాబు,గోళ్ళ నాగేశ్వరరావు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.