ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఎదుగుదల ఓర్వలేకనే తప్పుడు ప్రచారాలు.

* నీతికి న్యాయానికి నిజాయితీకి మారు పేరే ఆదివాసీ సంక్షేమ పరిషత్. * ఏఎస్ఆర్ ఉమ్మడి అల్లూరి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.26.2026″ఆదివాసి సంక్షేమ పరిషత్”(274/16)ఆదివాసీ సమాజానికి వెన్నుధన్నుగా ఉంటూ.ఆదివాసుల ఉనికిని కాపాడుకుంటూ.నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ.అంచెలంచెలుగా ఎదుగుతున్న ఎదుగుదలను.మరియు ప్రజల చూపిస్తున్న.ఆధారణను చూసి ఓర్చుకోలేక,కొన్ని ఆదివాసి సంఘాల్లో ఉంటున్న.కొంతమంది నాయకులు వారి సంఘాలను.నడిపించుకోలేక మనుగడను కోల్పోతూ.వక్రబుద్ధితో అసూయతో ఈర్ష్యతో మా సంఘంపై,మరియు నాపై డబ్బులు తీసుకుంటున్నారంటూ.తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.”ఆదివాసి సంక్షేమ పరిషత్”(274/16)ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు ఆవేదన వ్యక్తపరిచారు.”ఆదివాసి సంక్షేమ పరిషత్”నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.ప్రజల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకు.వెళ్తూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడడంతో.ప్రజలు “ఆదివాసి సంక్షేమ పరిషత్”(274/16)కి దగ్గరవుతున్నారని,కొంతమంది ఆదివాసి సంఘాల పేర్లు పెట్టుకుని.ప్రజల సమస్యలను పట్టించుకోకుండా.తమ సంఘంపై బురద జల్లుతూ తప్పుడు.ప్రచారాలు చేస్తూ పనికట్టుకుని తిరుగుతున్నారని,ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి.నాన్ ట్రైబుల్స్ దగ్గర,రాజకీయ పార్టీల దగ్గర ఎంత బిక్షం తీసుకున్నారో.వారి వివేకానికి వదిలేస్తున్నానని.ఆయన అన్నారు.సాటి ఆదివాసి సంఘాం నిజాయితీగా.నిష్పక్షపాతంగా ఆదివాసి సమస్యల పరిష్కార కోసం పనిచేస్తా.ఉంటే ఓర్చుకోలేనివారు.ఆదివాసి సంఘాల నాయకులుగా పనిచేయటానికి.అర్హులు కారని,ఇప్పటికైనా వారు తీరు మార్చుకోకపోతే ప్రజల చేతనే వారికి బుద్ధి చెప్పిస్తామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *