గోదావరి కృష్ణా కో-అపరేటివ్ సొసైటీ లిమిటెడ్ జగ్గయ్యపేట నూతన శాఖ ప్రారంభంచైర్మన్ మేడూరి జీవన్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 27 జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు న రాష్ట్రవ్యాప్తంగా శాఖల విస్తరణే లక్ష్యం చిరు వ్యాపారుల కోసం “ఉజ్వల లోన్ “పథకం పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి GK-భవిష్య 369 పధకం మహిళల అభివృద్దికి నారి సంకల్ప్ గ్రూప్ లోన్స్ చిరు వ్యాపారులకు ఆర్ధిక ఆలంబన,చిన్న మదుపర్లకు ఆర్ధిక లాభం కలిగించే లక్ష్యాలతో గోదావరి కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీ (జీకేసీఎస్) ప్రారంభించామని చైర్మన్ మేడూరి జీవన్ అన్నారు. బుధవారం జగ్గయ్యపేటలో సొసైటీ మెయిన్ బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ లక్ష్యాలను వివరించారు.చిన్న ఆర్థికస్థాయి కుటుంబాలు,చిరు వ్యాపారులు,బ్యాంకు రుణాలు అందుకోలేని వారు,కాల్ మనీ బాధితులు కాకుండా అరికట్టేందుకే సొసైటీ స్థాపించమని అన్నారు.పొదుపు చేసుకునే వారికి ఆకర్షణీయమైన వడ్డీతో బాటు,గోల్డ్ లోన్ సదుపాయం కూడా ఉందని అన్నారు. ప్రముఖ తాత్వీకులు గెంటేల వెంకట రమణ గురూజీ శుభాశీస్సులతో ప్రారంభించిన సొసైటీ పేదలకు అండగా నిలబడే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. ఉమ్మడి కృష్ణా మరియు ఎన్ టి ఆర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 23 బ్రాంచ్‌లను ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం తమ శాఖలను విస్తరించే యోచనలో ఉన్నామని, తెలియజేశారు. జగ్గయ్యపేట బ్రాంచ్ లో మొత్తం 220 మంది కి పైగా సభ్యులు, డిపాజిట్లు సేకరణ మరియు లోన్స్ అందజేత చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ వెంకటేష్,క్లస్టర్ హెడ్స్ రాజు,త్రిపుర మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *