నూతనంగా ఎన్నిక కాబడిన వార్డు సభ్యులకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను ప్రతి ఒక్క వార్డు సభ్యులు వినియోగించుకోవాలి తహశీల్దార్ శ్రీ టి. కరుణాకర్ రెడ్డి ..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 27, తల్లాడ రిపోర్టర్ స్దానిక తల్లాడ రైతు వేదిక నందు వార్డు సభ్యులకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తహశీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను గ్రామ పంచాయితీ అభివృద్ధికి సక్రమంగా ఉపయోగించుకునేలా వార్దు సభ్యులు కీలక పాత్ర పోషించాలని, గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం జరిగేలా, వేసవి కాలం దృష్ట్యా మంచి నీటి కొరత లేకుండా చూసుకొవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీ అంబటి శ్రీధర్ రాజు , ఎంపిఓ శ్రీ ఏనుగు సురేష్ బాబు, ప్రత్యేక శిక్షకులు జొన్నలగడ్డ పరశురాం, స్దానిక పంచాయితీ కార్యదర్శి శ్రీ యస్ యూ ఎం వి కృష్ణారావు, మరియు మండల పరిషత్ సిబ్బంది పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *