పయనించే సూర్యుడు న్యూస్ ది.27.03.2026 నేలకొండపల్లి మండల రిపోర్టు సామల రామకృష్ణ ఖమ్మం జిల్లా,పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ, డిసిసి మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేలకొండపల్లి వాసి రామదాసు భద్రాచలం లో ఎన్నో కష్టాలు పడి రామాలయం నిర్మించారన్నారు.. గత ప్రభుత్వం భద్రాచలం ఆలయాన్ని పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు, ప్రజల కోరిక మేరకు విడతల వారీగా 560 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నారని పేర్కొన్నారు.. కేటీఆర్, కవిత లాంటి వాళ్ల్లు ఖమ్మం వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నరని ఆయన మండిపడ్డారు.. గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉండి వారు చేయని పనులు ముగ్గురు మంత్రులు చేసి చూపిస్తున్నరన్నారు. జాతీయ రహదారులు, సాగు నీటి ప్రాజెక్టులు,విద్యారంగంలో, వైద్య రంగం లో ఖమ్మం జిల్లాను ముందుకు తీసుకుపోతున్నరని ఆయన చెప్పారు.. పది సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇందిరమ్మ ప్రభుత్వం లో పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు.. పది సంవత్సరాల్లో చేయలేని పనులు కాంగ్రెస్ చేస్తుందని ఆ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆయన విమర్శించారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారని ఆయన స్పష్టం చేశారు..