పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /27: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం నిన్నటి రోజున ఇల్లంతకుంట మండలం రంగపేట గ్రామానికి చెందిన దుర్ముట్ల బాబు, భార్య, కుమారుడు బావిలో దూకి మరణించిన ఘటన అత్యంత బాధాకరం. నేడు జరిగిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో ఇల్లంతకుంట సర్పంచ్ ఎం రాజు , రంగపేట సర్పంచ్ భాస్కర్ రెడ్డి , ఉపసర్పంచ్ ఇప్ప రాములు, పాల్గొని మృతుల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు రేగుల కార్తీక్, వార్డు సభ్యుడు కునబోయిన రఘు, బ్యాంక్ రాజు మరియు ఇతరులు పాల్గొని మృతులకు నివాళులర్పించారు.
