పయనించే సూర్యుడు న్యూస్,మార్చి 27(ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):ఈ నెల 20తారీకున మర్రివీడు గ్రామంలో కొనుసూరి రాంబాబు (తండ్రి నాగన్న) కు చెందిన గేదె దూడ పులి దాడిలో మృతి చెందినది. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించి, బాధితునికి తక్షణ సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.జిల్లా అటవీ శాఖాధికారి ఎన్.రామచంద్రరావు చొరవతో బాధితునికి రూ18వేల రూపాయలు నష్టపరిహారం మంజూరు చేయబడింది.ఈ నష్టపరిహారాన్ని గురువారం ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చేతుల మీదుగా డీడీ రూపంలో బాధితుడికి అందజేయడమైనది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పులి దాడులతో రైతులు,పశువుల యజమానులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.దుర్గారామ్ ప్రసాద్,డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎమ్.జాన్సన్,అటవీ శాఖ సిబ్బంది,కంబాలపాలెం గ్రామ ఎంపీటీసీ కొప్పుశెట్టి సూరిబాబు,నాయకులు బుజ్జి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.