హుజురాబాద్ బార్ ఎన్నికల్లో శేషయ్య ఘన విజయం – కొత్త నాయకత్వానికి బార్ సభ్యుల భారీ మద్దతు

* 125 ఓట్లతో ఉత్సాహంగా పోలింగ్ * కీలక పదవుల్లో కొత్త నాయకత్వం ఎన్నిక * పారదర్శకంగా సాగిన ఎన్నికల ప్రక్రియ

పయనించే సూర్యుడు / మార్చి 27 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; హుజురాబాద్ బార్ అసోసియేషన్ 2026–2027 సంవత్సరానికి సంబంధించిన ఎన్నికలు 26-03-2026న విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మొత్తం 125 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడిగా కేసరి శేషయ్య 63 ఓట్లతో గెలుపొందగా, శంకర్ కనుకుంట్ల 57 ఓట్లు, కామాని సమ్మయ్య 4 ఓట్లు సాధించారు. ఉపాధ్యక్షుడిగా పిట్టల రాజేష్ 84 ఓట్లతో విజయం సాధించగా, బత్తుల తిరుపతి 39 ఓట్లు పొందారు. సాధారణ కార్యదర్శిగా పాక జ్యోత్స్నా దేవి 85 ఓట్లతో గెలుపొందగా, సరిత కుమ్బాకర్ 34 ఓట్లు సాధించారు. జాయింట్ కార్యదర్శిగా యెంగాల లింగమూర్తి 47 ఓట్లతో గెలవగా, గుడెపు వంశీకృష్ణ 36, గుంటిహారి హరన్ 39 ఓట్లు పొందారు. క్రీడలు & సాంస్కృతిక కార్యదర్శిగా మోరే కళ్యాణ్ 74 ఓట్లతో గెలిచారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా యాస్మిన్ 66 ఓట్లతో విజయం సాధించగా, చిదురాల శ్రీనివాస్ 59 ఓట్లు పొందారు. ఎన్నికల అధికారులు జోజుల ప్రవీణ్ కుమార్, గురాల వెంకట్ కుమార్, బాగోతు కుమారస్వామి ఫలితాలు ప్రకటించారు. ఎన్నికలు సాఫీగా, పారదర్శకంగా జరిగాయి. ఈ ఎన్నికలు బార్ సభ్యుల్లో ఐక్యతను ప్రతిబింబించాయి. కొత్తగా ఎన్నికైన నాయకత్వం న్యాయవాదుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *