పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 27.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి హుండీ లెక్కింపు ద్వారా రూ 35.33.848లు ఆదాయంగా సమకూర్నట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు కొండపై 31 రోజులకు గాను నిర్వహించిన లెక్కింపులో నగదు తో పాటు 10 గ్రాముల బంగారం 136 గ్రాముల వెండి వె రెసి కరెన్సీ అమ్మవారికి కానుకలుగా వేసినట్లు ఆయన వివరించారు అన్నదానము పొందగల హుండీ ద్వారా రూ 12.444లు రణభేరి గంగమ్మ ఆలయంలో ఉంచిన హుండి ద్వారా రూ 22.655లు ఆదాయంగా సమకూరిందన్నారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శశి కుమార్ ఆలయ అధికార అర్చక సేవక్ సిబ్బంది పాల్గొన్నారు