యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి సైనికులు లాగా పని చేయాలి : జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి .

పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ మార్చి 27 యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిన్న నల్లగొండ లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశాలు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నాయి. జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జ్‌ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటీలలో, క్షేత్రస్థాయిలో పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కమిటీల ఏర్పాటు మరియు నిరసన కార్యక్రమాలపై నాయకులు చర్చిస్తున్నారు . ఈ సమావేశానికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీలు నల్లగొండ జిల్లా ఇంచార్జులు అయిన దుబ్బాక చంద్రిక, పాలడుగు నాగార్జున మరియు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పెద్దగోని మౌనిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారితో పాటు జిల్లా కమిటీ సభ్యులు,అసెంబ్లీల అధ్యక్షులు, మండల అధ్యక్షులు,ఆయా కమిటీల సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు ద్వారా యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాజకీయంగా ఎదగడానికి అనుసరించాల్సిన విధానాలపై నాయకులు పలు కీలక సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *