పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి .28 .2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం, దేవారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పోతవరం గ్రామంలో మన భారత్ ఆదివాసి పార్టీ యువ నాయకుడు చవలం విద్యా సాగర్ ఆధ్వర్యంలో.దేవీపట్నం మండలంలో అన్ని 14 పంచాయతీల మీద అవగాహన ఉన్న కొంతమంది నాయకులతో భారత్ ఆదివాసి పార్టీ గురించి చర్చించి, ఆ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు స్థానిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశా నిర్దేశం చేయడం జరిగింది. వాళ్లందర్నీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం తెలుపుతూ… భారత్ ఆదివాసీ పార్టీలోకి జరగబోయే స్థానిక ఎన్నికలలో భారత్ ఆదివాసి పార్టీ జాయిన్ అయ్యారు. భారత్ ఆదివాసీ పార్టీ తరుపున పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పండా కృష్ణమూర్తి, చవలం విద్యా సాగర్, కుంజం రామన్న దొర, కారం రాజేష్, కారం రామ దుర్గం,మడకం వెంకటేష్, కారం తరుణ్ కుమార్ దొర, తుర్రం వెంకన్న దొర,కారం ప్రకాష్, మడకం సుదీర్ తురసం వెంకన్న దొర మొదలైన వారు పాల్గొనడం జరిగింది.జై ఆదివాసి జై జై భారత్ ఆదివాసి పార్టీ