అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 28 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని మండలం మైదుపల్లి రామాలయం లో వైభవంగా సీతారాముల వివాహం. శ్రీరామనవమి సందర్భంగా మైదుపల్లి రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలతో సీతారాముల కళ్యాణం జరిపించారు. పండితులు సీతా రాముల కళ్యాణం జరిపిస్తూ శ్రీరామనవమి విశిష్టతను తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో సీతారాముల కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *