తల్లాడలో ఫ్యూచర్ జెన్ ఏసీ క్యాంపస్ స్కూల్ ప్రారంభం..

* శ్రీరామనవమి రోజున సత్యనారాయణ వ్రతం, శాంతి హోమాలు.. * జిల్లాలోనే తొలిసారిగా ఏసీ క్యాంపస్ స్కూల్ ప్రారంభం.. * స్కూల్ చైర్మన్ ధలువాయి కిషోర్ కుమార్, డైరెక్టర్ సాయి మెహర్..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 28, తల్లాడ రిపోర్టర్ ఖమ్మంజిల్లా తల్లాడ పట్టణంలోని కొత్తగూడెం రోడ్డులో శ్రీ సప్తగిరి వెంచర్ లో మెహర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన హంగులతో నిర్మించిన ఫ్యూచర్ జెన్ ఏసి స్కూల్ శుక్రవారం ప్రారంభమైంది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్కూల్ చైర్మన్ ధలువాయి కిషోర్ కుమార్, డైరెక్టర్ సాయి మెహర్ చేతులమీదుగా ప్రారంభించారు. తొలుత శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శాంతి హోమం, సత్యనారాయణ వ్రతం, శ్రీరాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పూజారులు, అర్చకుల వేదమంత్రాల నడుమ ప్రత్యేక వ్రతాలు చేశారు. అనంతరం చైర్మన్ కిషోర్ కుమార్, డైరెక్టర్ సాయి మెహర్ మాట్లాడుతూ జిల్లాలోనే తొలిసారిగా తల్లాడలో ఏసీ క్యాంపస్ స్కూల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. బావి భారత పౌరులకు మెరుగైన విద్యను అందించాలనే సదుద్దేశంతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే డిజిటల్ విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటువంటి రెండు, మూడు మాత్రమే ఉన్నాయని, అలాంటిది గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తల్లాడ పట్టణంలో స్కూలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్కూల్ గదుల్లో పరిమిత విద్యార్థులచే విద్యాబోధన అందిస్తామన్నారు. ఈ ప్రాంత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *