సీతా రాముల శోభాయాత్ర

పయనించే సూర్యుడు మార్చ్ 28-3-26 కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ జై నూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ వార్త విశ్లేషణ :: జైనూర్ లో ఘనంగా సీతా రాముల శోభయాత్ర కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీత రాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం సీతారాముల విగ్రహాలను వాహనాలు అలంకరించి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రలో జై శ్రీరామ్ నామ స్మరణ నినాదాలు చేస్తూ భక్తిశ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం హనుమాన్ మందిర్ ఆలయంలో గల కళ్యాణ మండపంలో సీతారాముల కల్యాణ వేడుకలు పురోహితులు కులకర్ణి పండిత్ మహారాజ్ చేతుల మీదుగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జైనూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కడప ప్రకాష్ మాజీ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, జై నూర్ ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాష్ , విశ్వహిందూ నాయకులు వివిధ పార్టీల నాయకులు భక్తులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *