పయనించే సూర్యుడు మార్చ్ 28 దండేపల్లి దండేపల్లి మండలంలో నంబాల గ్రామంలో హనుమాన్ దీక్ష స్వాములు మరియు గ్రామ ప్రజలు ఘనంగా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. హనుమాన్ ఆలయం వద్ద పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర చేపట్టడం జరిగింది. శోభ యాత్ర ముగిసిన అనంతరం హనుమాన్ స్వాములు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనంతరం సామూహిక హనుమాన్ భీక్ష స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు మరియు భక్తులు పాల్గొని హిందువుల ఐక్యత చాటడం గొప్ప పరిణామం అని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హిందువు తమ వంతు కృషి చేయాలని సూచించారు. హనుమాన్ దీక్ష స్వాములు పేద ఎత్తున పాల్గొని విజయవంత చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు తతిదరులు పాల్గొన్నారు
