పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 28 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ అనపర్తి నియోజకవర్గ తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన కృషి ఫలించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మంచినీటి వసతుల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ. 42 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో రంగంపేట మండలంలోని పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల బలోపేతానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల వారీగా మంజూరైన నిధుల వివరాలు (రూ. లక్షల్లో): రంగంపేట మండలంలోని 10 గ్రామాలకు సంబంధించి మొత్తం రూ. 7.48 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి: వడిశలేరు: 1.60 కోట్లు, మర్రిపూడి: 1.54 కోట్లు, యస్టీరాజపురం: 83.25 లక్షలు, రంగంపేట: 76.50 లక్షలు, వెంకన్నపేట: 57.20 లక్షలు, కోటపాడు: 53.10 లక్షలు, సింగంపల్లి: 53.10 లక్షలు, రామేశంపేట: 50.40 లక్షలు, చిన దొడ్డిగుంట: 31.67 లక్షలు, కె. వీరంపాలెం: 28.33 లక్షలు. ప్రజల ఇబ్బందులు తీర్చడమే లక్ష్యం: గ్రామాల్లో ఉన్న పాత మంచినీటి పథకాలు పెరిగిన జనాభాకు సరిపడా నీటిని అందించలేకపోతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ నిధులను మంజూరు చేయించారు. ఇప్పటికే అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాలకు జలజీవన్ మిషన్ ద్వారా రూ. 35 కోట్లు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. తాజాగా రంగంపేట మండలానికి కూడా నిధులు రావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “సమర్థుడైన పాలన ఉంటే ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది” అనడానికి ఎమ్మెల్యే నల్లమిల్లి నిరూపిస్తున్నారని కూటమి నాయకులు కొనియాడారు.