ఖానాపూర్‌లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

* పల్లకి మోసిన సర్పంచ్ శేఖర్ ముదిరాజ్, ఉపసర్పంచ్ శంకర్ నాయక్ * బారీగా తరలివచ్చిన గ్రామ ప్రజలు, భక్తజనం

పయనించే సూర్యుడు మార్చి 28, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి సేవను పురస్కరించుకుని నిర్వహించిన శోభాయాత్రలో గ్రామ సర్పంచ్ పూజారి శేఖర్ ముదిరాజ్, ఉపసర్పంచ్ శంకర్ నాయక్ స్వయంగా పల్లకిని భుజాన మోసి భక్తిని చాటుకున్నారు. గ్రామ పెద్దలు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ రెడ్డి, సంతోష్, శేఖర్, జీవన్ రెడ్డి, కాంత్ రెడ్డి, హరీష్ గౌడ్, యాదగిరి, శ్రీనాథ్ రెడ్డి తదితరులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఖానాపూర్ వీధులన్నీ మారుమోగిపోయాయి. యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా అనంతరం అందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *