పయనించే సూర్యుడు 28-3-2026 గుల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్ర శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయంలోని సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం భాగంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చే భక్తులకు సకల సౌకర్యలు ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు.ఉదయం నుండి శ్రీ రామచంద్రస్వామి వారిని సీతమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. 12: 30 సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామి వారి కళ్యాణం లో ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహా రెడ్డి,వారి దంపతులు,ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి దంపతులు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు అనంతుల భూమయ్య,దంపతులు కూర్చున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామి వారి కళ్యాణం మహోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమని నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, దీక్షాపరులు స్వామివారిని భారీ సంఖ్యలో దర్శించుకుని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దాదాపు భక్తులు నాలుగు వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ సంవత్సరం సరైన సమయంలో భోజనాలు ఏర్పాట్లు చేయడం పట్ల వచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు.