ఎర్రకుంట తండాలో శ్రీ సీతారామ స్వామి కళ్యాణం వైభవంగా

కార్యక్రమంలో గిరిజన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

పయనించే సూర్యుడు మార్చి 28 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం ఎర్రకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని జగిన తండాలో రాత్లావత్ మాన్య నాయక్ గారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్లావత్ మాన్య నాయక్ మాట్లాడుతూ, గుడి నిర్మాణం చేపట్టి పది సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం, అన్నదాన కార్యక్రమం, తీర్థ ప్రసాదాల పంపిణీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా సర్పంచులు, మాజీ సర్పంచులు, గోవిందు నాయక్, బుజ్జి చందులాల్, గోపాల్ నాయక్, కృష్ణా నాయక్, లలితా రవి నాయక్, విజయ్ కుమార్, జ్యోతి చందు నాయక్, శ్రీశైలం సీతారాం, రాజు పిట్యా, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గిరిజన ప్రముఖులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *