చౌటుప్పల్ పట్టణంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

* వేడుకలకు హాజరై పట్టువస్త్రాలు సమర్పించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు.

పయనించే సూర్యుడు న్యూస్ చౌటుప్పల్ మార్చి 28. చౌటుప్పల్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు శ్రీరామనవమి వేడుకలకు హాజరైన పుణ్య దాంపతులకు ఘన స్వాగతం పలికారు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకల పాలకవర్గ సభ్యులు… పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టు వస్త్రాలు సమర్పించిన దంపతులకు వేద ఆశీర్వచనం చేసారు అర్చకులు అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి లో శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొని తన సతీమణి శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *