పన్నూర్ లో యూనియన్ బ్యాంకు ఏర్పాటు

* ప్రారంభోత్సవంలో పాల్గొన్న పన్నూర్ గ్రామ సర్పంచ్ చిందం మహేష్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరి కాలనీ-28:- రామగిరి మండలం పన్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను హైదరాబాద్‌కు చెందిన సీజీఎం & జోనల్ హెడ్ ఎం. రవీంద్ర బాబు కరీంనగర్‌కు చెందిన డీజీఎం & రీజినల్ హెడ్ డి. అపర్ణ రెడ్డి, సింగరేణి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకరి మధుసూదన్, పన్నూర్ గ్రామ సర్పంచ్ చిందం మహేష్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.అనంతరం బ్యాంక్ అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్, బ్యాంక్ కౌంటర్లను పరిశీలించారు. సర్పంచ్ చిందం మహేష్ మాట్లాడుతూ…పన్నూర్ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ప్రారంభం కావడం గ్రామ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఇది గ్రామ ప్రజల ఆర్థికాభివృద్ధికి కొత్త దారులు తీసుకురానుందని అన్నారు.రైతులు, మహిళలు, యువతకు రుణాలు, పొదుపు పథకాలు మరియు ఇతర బ్యాంకింగ్ సేవలు సులభంగా లభించడం ద్వారా గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.గ్రామ అభివృద్ధి కోసం ఇటువంటి సదుపాయాలను తీసుకురావడంలో సహకరించిన బ్యాంక్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *