సోమశిల,ఉప్పలపాడు హైవేలో చలివేంద్రం ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ : మార్చ్ 29 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే, సోమశిల గ్రామ బస్టాండ్ సెంటర్‌లో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కంటే శ్రీనివాస్ భరత్, మండల అధ్యక్షులు ఉదయగిరి రవి, మండల ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ సూచనలతో జనసేన నాయకులు ఎం.కృష్ణ, ముద్దులూరు బుజ్జిరాజు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పల విజయ్ కుమార్, యోగు పెంచలయ్య, ముక్కు పుల్లయ్య గౌడ్, పార్థసారథి నాయుడు, గువ్వల పెంచలయ్య, జంజం నారాయణ, సయ్యద్ అబ్దుల్ రెహమాన్ తదితరులు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ , ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీరు అందించేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చలివేంద్రాలు సుమారు రెండు నెలల పాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ నాయకులు రసూల్, గౌస్, సయ్యద్ మహమ్మద్ హుస్సేన్, సోమిశెట్టి సుబ్బారావు, బీజేవైఎం మండల అధ్యక్షులు గుండుబోయిన సతీష్, బిజెపి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *