తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానమునందుపరాభవ నామ సంవత్సర శ్రీరామ నవమి పర్వదినాన దేవస్థాన నిత్య కల్యాణ మండపము నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 29 పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానమునందు ది 27.03.2026 న శ్రీ పరాభవ నామ సంవత్సర శ్రీరామ నవమి పర్వదినాన ఉదయం గం. 09.42 ని.లకు దేవస్థాన నిత్య కల్యాణ మండపము నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా శ్రాస్రోత్తముగా నిర్వహించడం జరిగింది అనంతరం భక్తులకు ప్రసాదం, పానకం వితరణ చేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి బి,మహేశ్వర రెడ్డి గారు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ యం.గోపిబాబు అరుణ దంపతులు, మాజీ ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్ బాబు దంపతులు,ఆలయ సిబ్బంది , గ్రామ పెద్దలు మరియు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. సదరు విషయము ప్రింట్ అండ్ మీడియా వారికి తెలియజేయడమైనది. ఉప కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి బి మహేశ్వర్ రెడ్డి తెలియజేసినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *