పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.29.03.2026 (ఆదివారం) ఉదయం 9:00 గంటలకు ఇందుకూరుపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి. అనంతరం అందరూ రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడమైనది. కావున దేవిపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.ఈ సందర్భంగా ప్రతి గ్రామం,ప్రతి వార్డులో. పార్టీ దిమ్మెలను ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఎగురవేయాలి.ఇప్పటికే ఉన్న పాత దిమ్మెలను శుభ్రపరిచి,రంగులు వేయించి జెండా ఆవిష్కరణకు సిద్ధం చేయాలి. దిమ్మెలు లేని ప్రాంతాల్లో కొత్త దిమ్మెలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా, మహానేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహం లేదా ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాలి.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని. ఉత్సాహభరిత వాతావరణంలో, భారీ ఎత్తున, కార్యకర్తలంతా ఐక్యంగా నిర్వహించి విజయవంతం చేయాలి. గోళ్ళ చంటిబాబు మండల అధ్యక్షులు దేవిపట్నం.