పయనించే సూర్యుడు మార్చి 29 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో కల్పిస్తానని హామీ ఇచ్చిన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే అత్యల్ప అక్షరాస్యత కలిగినటువంటి ప్రాంతంగా గణాంకాల సర్వేలో కర్నూలు పశ్చిమ ప్రాంతం చిట్టచివర లో ఉన్నందువల్ల ఆదోనినీ జిల్లా గా ప్రకటించాలనీ133వ రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా కొనసాగినది. అనతి కాలం నుండి ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి బళ్లారి జిల్లాకి 56 కిలోమీటర్లు దూరంలో ఉన్నప్పటికీ కర్నూల్ లో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకొని నిలువను దోపిడీ చేస్తున్న కర్నూలు ప్రాంత నాయకులు. నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, ప్రభుత్వ వైద్యం కల్పించడంలో , ఉన్నత విద్యాలయాల నిర్మాణలో , నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో , పరిశ్రమల నిర్మాణంలో , వలసల నివారణ చర్యలలో , రోడ్ రవాణా సమస్యల నివారణ చర్యల నిర్లక్ష్యంలో వహిస్తూ కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వెనుకబాటు తనానికి కారకులయ్యారు. అందుకే ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఐదు నియోజకవర్గాల కేంద్రమైనటువంటి ఆధోనిని జిల్లా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. ఆదోని జిల్లా ప్రజల సహనాన్ని ప్రశ్నించవద్దు ప్రజా సంఘాలతో కూడిన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి భారీ ప్రణాళికలతో మునుముందు కూటమి ప్రభుత్వానికి పట్టపగలే చుక్కలు చూపించే విధంగా ఉద్యమాన్ని నడిపిస్తాం. రాబోయే ఆదోని జిల్లా ఉద్యమంలో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి ఆదోని జిల్లా సాధించుకుంటామని జేఏసీ నాయకులు తెలియజేశారు. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష 150వ రోజు చేరుకోవడం సందర్భంగా బహిరంగ సభకు అఖిలపక్ష పార్టీల పెద్దలను ప్రజాసంఘాల పెద్దలను ఆహ్వానించి కూటమి ప్రభుత్వాల గద్దె దించడానికి మేము వినకాడబోమని తెలియజేశారు. అందుకే శనివారం మందకృష్ణ మాదిగ గారిని భారీ బహిరంగ సభకు ఆహ్హనించడం జరిగినది. 133వ రోజు రిలే నిరాహార దీక్షలో సుభాష్ చంద్రబోస్, కుమార్, రామకృష్ణ, రామాంజనేయులు, కిరణ్ కుమార్ లు కూర్చొని జిల్లా ఉద్యమానికి మద్దతు తెలిపారు. రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి ఆదోని జిల్లా ఉద్యమ నాయకులకి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారిని, జేఏసీ నాయకులు, పగడాల కోదండ, వైపి నాగరాజు, బండారి హనుమంతు,గుమ్మల బాలస్వామి, గోవిందు, సుజ్ఞానమ్మ, పిఎస్ వీరేష్, బండారి గిడ్డయ్య, దత్తు తదితరులు కలిసి భారీ బహిరంగ సభకు ఆహ్హనించడం జరిగినది.