ముగిసిన పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ తరగతులు.

* వార్డు సభ్యులకు సర్టిఫికెట్లను అందించిన ఎంపీడీవో శ్రీనివాస్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 29 సాలూర : సాలూర మండలానికి చెందిన పంచాయతీ వార్డు సభ్యులకు గత 5 రోజుల నుంచి శిక్షణ తరగతులు కొనసాగాయి.మండల కేంద్రంలోని రైతు వేదికలో కొనసాగిన శిక్షణ తరగతులు శనివారంతో ముగిసాయి.మండలం ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీవో శిక్షణ పొందిన వార్డు సభ్యులకు శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్లను అందజేశారు.ప్రజలకు అందించవలసిన సేవలు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు చేయవలసిన పనుల తీరును శిక్షణా తరగతులలో వార్డు సభ్యులకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీల కార్యదర్శిలు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *