మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

* సింగిల్ విండో డైరెక్టర్ - మట్ట వెంకటయ్య గౌడ్

పయనించే సూర్యుడు, మార్చి 29 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా పొట్టి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రానికి చెందిన వానరాశి చంద్రమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం మరణించడం జరిగింది. కార్యకర్తల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటేష్ గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా కుటుంబం అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని ఎప్పుడూ అండగా మేము ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్, మట్ట నిరంజన్ గౌడ్, సమీర్ బాబా, రాములు, వెంకటయ్య, శివ, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *