మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

* బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు - కానుగుల జోగయ్య

పయనించే సూర్యుడు, మార్చి 29 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా పొట్టి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రానికి చెందిన వానరాశి చంద్రమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం మరణించడం జరిగింది. కార్యకర్తల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా కుటుంబం అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని ఎప్పుడూ అండగా మేము ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చలిచీమల జ్యోతినిరంజన్, వార్డు సభ్యులు సిర్సనగండ్ల శేఖర్, 4వ వార్డు సభ్యులు జంగిలి సునీతఆనంద్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొమ్ము నాగేష్, మట్ట శ్రీను, మావిళ్ళ గణేష్, కోట్ల శేఖర్, బెట్టి సైదులు, శివ, సిద్దు, గొడుగు శివ, వానరాశి రాములు, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *