వరి రైతులకు హెచ్చరిక: పొలాల్లో పొంచి ఉన్న ‘దోమపోటు’ గండం

పయనించే సూర్యడు మార్చి 29 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ​ నడిగూడెం మండల పరిసర గ్రామాల్లోని రైతు సోదరులకు ముఖ్య గమనిక. ప్రస్తుతం వాతావరణంలో సంభవిస్తున్న ఆకస్మిక మార్పుల పట్ల వరి సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని రామాపురం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మారిశెట్టి నరసింహారావు కోరారు. ​వాతావరణ మార్పులతో ముప్పు: గత కొన్ని రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి, రాత్రి వేళల్లో చలి పెరుగుతోంది. ఇటువంటి వాతావరణం వరి పంటకు ‘దోమపోటు’ (బిపిహెచ్) ఆశించడానికి ఎంతో అనుకూలం. దీనివల్ల పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడమే కాకుండా, తీవ్ర ఆర్థిక నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ​రైతులకు సూచనలు: ​రైతులు వెంటనే తమ పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ​వరి దుబ్బుల మొదలు భాగంలో దోమ ఉధృతిని గమనించాలి. ​దోమపోటు లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వ్యవసాయ అధికారుల సలహా మేరకు నివారణ చర్యలు చేపట్టాలి. ​పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవడం, అవసరమైతే కొద్దిరోజులు నీటిని తీసివేసి ఆరబెట్టడం ద్వారా దోమ ఉధృతిని తగ్గించవచ్చు. ​”కష్టపడి పండించిన పంటను చీడపీడల బారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అజాగ్రత్త వహించకుండా తక్షణమే మేల్కొని తగిన జాగ్రత్తలు పాటించి నష్టపోకుండా చూసుకోవాలి” అని నరసింహారావు రైతులకు విజ్ఞప్తి చేశారు. ​ఇట్లు, మారిశెట్టి నరసింహారావు మాజీ సింగిల్ విండో డైరెక్టర్, రామాపురం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *