గ్యాస్ వినియోగదారులను ఇబ్బంది పెట్టొద్దు.. సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 30, తల్లాడ రిపోర్టర్ తల్లాడ, గ్యాస్ వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా సకాలంలో గ్యాస్ సిలిండర్లను అందించాలని సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తల్లాడ లోని కోట మైసమ్మ గ్యాస్ ఏజెన్సీ వద్ద కు సీపీఎం నాయకులు చేరుకొని వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓటిపి వచ్చిన రోజుల తరబడి సిలిండర్ ఇవ్వకుండా తిప్పించుకుంటుంన్నారని ఆరోపించారు. పలువురు గ్యాస్ సిలిండర్ తీసుకోకపోయినా డెలివరీ అయినట్టు మెసేజ్ లు వస్తున్నట్లు చెప్పారు. అలా ఎందుకు జరుగుతుందని ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పి ప్రశ్నించిన వారికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ బండలను బ్లాక్ నిర్వాహకులకు తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వినియోగదారులు వందల సంఖ్యలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు ఎండలో రహదారి పక్కన ఇబ్బందులు పడుతున్న ఏజెన్సీ నిర్వాహకులు కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా లో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం సీపీఎం నాయకులు తమ్మిశెట్టి శ్రీనివాసరావు, మన్నేపల్లి అర్జున్ రావు, చల్లా నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *