రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

పయనించే సూర్యుడు గాంధారి 30/03/26 కామారెడ్డి జిల్లా గాంధారి రాంపూర్ గడ్డ సమీపంలో శనివారం రాత్రి 11.00 ద్విచక్రవాహనం అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. రాంపూర్ గడ్డ భావన రైస్ మిల్లులో పనిచేస్తున్న బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు గాంధారి వైపు బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగంతో వెళ్తున్న బైక్ రాంపూర్ గడ్డ కల్వర్ట్ వద్ద స్కిడ్‌ అయ్యి, రోడ్డు కిందకు దూసుకెళ్ళడంతో బాధితుల తల, ముక్కు, చెవుల నుంచి తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందించగా.. క్షతగాత్రులను పరిశీలించిన వైద్య సిబ్బంది.. ప్రాణాలు కోల్పోయినట్టుగా నిర్ధారించారు. మృతులను లాల్తూర్ ముఖియా(21), రాహుల్ (21), జావీద్ అంసారి (22)గా గుర్తించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అధిక వేగం జీవితాన్ని అంతం చేయకూడదని, వాహనదారులు డ్రైవింగ్‌ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *