చర్చీలలో ఘనంగా మట్టల ఆదివారం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 30 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలో అల్లిగూడెం దిబ్బగూడెం రామన్నగూడెం, తిరుమల కుంట, వినాయకపురం, నందిపాడు, గ్రామాలలో క్రైస్తవ సోదరులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ నేపథ్యంలో ప్రార్థన మందిరంలో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈస్టర్ పండగ ముందుగా వచ్చే ఆదివారం ను మట్టల ఆదివారం నేపథ్యంలో గ్రామాలలోని ఖర్జూరపు మట్టలను చేతిలో పట్టుకొని పురవీధుల్లో తిరుగుతూ దేవుని గీతాలను ఆలపించారు పాస్టర్ సియోను కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవ ప్రత్యేక ప్రార్ధన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ సియోను కుమార్ సంఘస్తులు కీర్తి బాబు సంగీత. సమీప ఇస్తే రు .సువార్త. జైపాల్ ప్రభుదాసు. కిషోర్. సుధాకర్. జయరాజు కుమారి రూతు జ్యోతి రాణి. సంఘస్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *