నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చొరవతో ‘చిన్నపొలమూరు’ రహదారి పనుల వేగవంతం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 30 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిన్నపొలమూరు కాలువ సమీపంలో గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా ఉన్న రహదారి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యుద్ధప్రతిపాదికన చేపట్టారు. రవాణా పరంగా అత్యంత కీలకమైన ఈ రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే, వెంటనే నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లకు, అధికారులకు ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తమ ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చిన్నపొలమూరు గ్రామస్తులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నేడు జరిగిన పనుల పరిశీలనలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *