గిరిజనులను అవమానించిన ఎమ్మెల్యే బెందళం అశోక్‌ తక్షణమే రాజీనామా చేయాలి.

* కూటమి రాష్ట్ర ప్రభుత్వం అశోక్ గారికి తెలుగుదేశం పార్టీ నుండి బర్తరాఫ్ చేయాలి. * ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు డిమాండ్.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 31.2026 అరకు వేలి నియోజకవర్గం, అరకు వేలీ మండల, అరకు వేలి నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల. చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివాసి గిరిజన నాయకులను, గిరిజన ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు. చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందళం అశోక్ తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా. చేసి గిరిజనులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని. ఆంధ్రప్రదేశ్ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు మాట్లాడుతూ… బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని వినతి పత్రం ఇవ్వడానికి. ఆదివాసి జేఏసీ ప్రతినిధులు జి.అప్పన్న, ఎస్.జగన్నాథ్ తదితరులు. ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన సందర్భంలో వారిపై ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో మాట్లాడడం. అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇతని పైన కూటమి రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు తక్షణమే నమోదు.చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ప్రజల సమస్యలు వినాల్సిన ప్రజాప్రతినిధి ఇలాంటి ప్రవర్తన చూపడం గిరిజన సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటువంటి నాయకులు గిరిజన హక్కులు చట్టాలు భంగం కలిగించడానికి. కుట్ర పన్నుతున్నారు.ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వము గిరిజనులకు రావలసిన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి.కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్ పేరుతో గిరిజనులకు దగా చేసి. సుమారు 5వేల ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులను గిరిజనులకు దక్కకుండా గిరిజనేతురులకు కట్టబెట్టింది. ఇది ఎంతవరకు సమంజసం గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన. ఎమ్మెల్యే తన పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. వెంటనే రాజీనామా చేసి గిరిజన నాయకులు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిజనుల సమస్యలపై చర్చించేందుకు వచ్చిన ప్రతినిధులను అవమానించడం. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్లను పట్టించుకోకపోతే. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే రాస్తారోకోలు, ధర్నాలు, ముట్టడిలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి యూత్ కాంగ్రెస్ అరకువెల్లి మండల అధ్యక్షుడు చిట్టం నాయక్ బలబదర్ యూత్ కాంగ్రెస్ నాయకుడు కుమీడిశెట్టి అచ్చిబాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *